NTV Telugu Site icon

Bhojshala Complex: ‘భోజ్‌శాల’ కాంప్లెక్స్‌పై 2000 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించిన ఏఎస్‌ఐ..

Bhojshala Complex

Bhojshala Complex

వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయం యొక్క శాస్త్రీయ సర్వే నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్‌కు సోమవారం సమర్పించింది. ASI తరపు న్యాయవాది హిమాన్షు జోషి 2000 పేజీల నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించారు. కాగా.. ఈ కేసును జులై 22న హైకోర్టు విచారణ జరుపుతుందని తెలిపారు. ఈ సర్వేలో వివిధ కాలాలకు చెందిన వెండి, రాగి, అల్యూమినియం, ఉక్కుతో తయారు చేసిన మొత్తం 31 నాణేలు దొరికాయని నివేదిక పేర్కొంది. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10వ-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13వ-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15వ-16వ శతాబ్దం), మొఘల్ (16వ-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం) బ్రిటిష్ వారికి చెందినవి. ఈ సర్వేలో మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు.. నిర్మాణ అంశాలు కూడా బయటపడ్డాయి.

Shankar: భారతీయుడు 2 అయిపొయింది.. గేమ్ ఛేంజర్ కోసం హైదరాబాదుకి శంకర్

వివాదాస్పద 11వ శతాబ్దపు స్మారకం ప్రాంగణంలో దాదాపు మూడు నెలల పాటు నిర్వహించిన సర్వే పూర్తి నివేదికను జూలై 15లోగా సమర్పించాలని ఏఎస్‌ఐని జులై 4న హైకోర్టు ఆదేశించింది. ఈ స్మారక చిహ్నం విషయంలో హిందువులు మరియు ముస్లింల మధ్య వివాదం ఉంది. ASI నివేదిక ప్రకారం భోజ్‌శాల ఒకప్పుడు ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా ఉండేది, దీనిని రాజు భోజ్ స్థాపించాడు. వెలికితీసిన కళాఖండాలు ప్రస్తుత నిర్మాణం మునుపటి దేవాలయాల భాగాలను ఉపయోగించి నిర్మించబడిందని సూచిస్తున్నాయి. హిందూ సమాజం భోజ్‌శాలను వాగ్దేవి (సరస్వతి దేవి) దేవాలయంగా పరిగణిస్తారు. అయితే ముస్లిం పక్షం ఈ 11వ శతాబ్దపు స్మారకాన్ని కమల్ మౌలా మసీదుగా పిలుస్తారు. ఈ సముదాయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) రక్షించింది. మార్చి 11న, ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ దరఖాస్తుపై.. మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌షాలా-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ASIని ఆదేశించింది. ఆ తరువాత.. ASI ఈ వివాదాస్పద కాంప్లెక్స్ యొక్క సర్వేను మార్చి 22 నుండి ప్రారంభించింది.. కాగా ఇటీవల సర్వే ముగిసింది.

Kerala: 46 గంటల పాటు కనిపించకుండపోయిన పారిశుధ్య కార్మికుడు.. కాలువలో మృతదేహం

సర్వే పూర్తి చేసేందుకు ఏఎస్‌ఐకి హైకోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. తర్వాత ఏఎస్‌ఐ నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం కోరింది. ఇటీవల ముగిసిన వివాదాస్పద కాంప్లెక్స్ సర్వేను మార్చి 22న ASI ప్రారంభించారు. భోజ్‌శాలపై వివాదం మొదలైన తర్వాత.. ASI 2003 ఏప్రిల్ 7న ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం.. గత 21 సంవత్సరాలుగా అమలులో ఉన్న విధానం ప్రకారం, హిందువులు ప్రతి మంగళవారం భోజ్‌శాలలో ప్రార్థనలు చేయడానికి అనుమతించబడతారు. ముస్లింలు ప్రతి శుక్రవారం ఇక్కడ నమాజ్ చేయడానికి అనుమతించబడతారు. ఈ వ్యవస్థను ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ తన పిటిషన్‌లో సవాలు చేసింది.