Site icon NTV Telugu

Exxeella Chairman: టీటీడీకి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ భారీ విరాళం..

Arasavilli Arvind

Arasavilli Arvind

కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రంలో నిత్య అన్న ప్రసాద ట్రస్టుకు విజయవాడకు చెందిన ఎక్సెల్లా (Exxeella) ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ. 10 లక్షల చెక్కును టీటీడీకి అందించారు. ఎంతో మంది విద్యార్థులను విదేశీ విద్య అభ్యసించడానికి ఒక దిక్సూచిగా ముందుండి.. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయటంతో పాటు పలు సేవ చేసే కార్యక్రమాలలో అరసవిల్లి అరవింద్ పాల్గొంటున్నారు.

Read Also: Perni Nani: జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీలో ఏనాడైనా సభ్యత్వం ఇచ్చారా..?

ఈ క్రమంలో అన్నదానం ట్రస్టుకు 10 లక్షల చెక్కును అందించడటం పట్ల ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ ను టీటీడీ అధికారులు అభినందించారు. అంతేకాకుండా.. 10 లక్షల చెక్కును అందించడం పట్ల అర్చకులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. స్వామి వారి భక్తుల కోసం టీటీడీ చేస్తున్న సేవలో భాగంగా తన వంతు సహాయం చేయటానికి సహకరించిన టీటీడీ అధికారులకి అరసవిల్లి అరవింద్ కృతజ్ఞతలు చెప్పారు.

Read Also: Selfie With Elephant: ఏనుగుతో సెల్ఫీ ప్రయత్నం.. వ్యక్తిని తొక్కి చంపేసింది..

Exit mobile version