AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AR Rahman : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక సెన్సేషనల్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అందుకు ఆయన తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
READ ALSO: Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. కేవలం పారితోషికమే కాకుండా, సినిమా లాభాల్లో కూడా ఆయనకు కొంత శాతం వాటా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఒక సంగీత దర్శకుడికి ఇంత భారీ మొత్తంలో పారితోషికం, ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన సీతగా సాయి పల్లవి నటిస్తోంది. రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ వంటి హేమాహేమీలు నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ వంటి పౌరాణిక గాథకు సంగీతం అద్భుతంగా ఉండటం చాలా అవసరం. అందుకే రెహమాన్ వంటి దిగ్గజం ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ పారితోషికం వార్త ఇప్పుడు ఇటు బాలీవుడ్, అటు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
READ ALSO: Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!