AR Murugadoss : ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న మురుగదాస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ.ఆర్ మురుగదాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.తమిళ్ ఇండస్ట్రీ లో శంకర్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ వున్న దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్. అప్పట్లో మురుగదాస్ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కమర్షియల్ అంశాలు బాగా దట్టించి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించడం ఆయన ప్రత్యేకత. తెలుగులో కూడా ఆయన సినిమాల కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మొదట మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాను తెరకెక్కించాడు మురుగదాస్. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా మంచి సినిమా గా పేరు తెచ్చిపెట్టింది..తెలుగులో మురుగదాస్ మహేష్ తో రెండవ సినిమా చేసాడు. ఆ సినిమానే స్పైడర్.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమా లో తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపించడం తో తెలుగు అభిమానులకు అంతగా నచ్చలేదు. స్పైడర్ తర్వాత మురుగదాస్ సర్కార్ మరియు దర్బార్ సినిమాల ను తెరకెక్కించాడు. ఆ సినిమాలు కూడా అంతగా మెప్పించలేదు.
ఇక దర్బార్ తర్వాత ఇప్పటివరకు మురుగదాస్ మరో సినిమాను ప్రకటించలేదు. మధ్యలో గజనీ సీక్వెల్ తీయబోతున్నాడు అంటూవార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు.. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తన కొత్త సినిమాను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.శివ కార్తికేయన్ తో త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాను ప్రకటించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందింది.. పీరియాడిక్ డ్రామా సెటప్‌లో ఈ సినిమా థీమ్ ఉండనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు తమిళంలో మంచి క్రేజ్ ఉంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్నట్లు సమాచారం..ఈ సినిమాను మురుగుదాస్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.. హీరోయిన్గా సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ ను తీసుకోనున్నట్లు సమాచారం..ఈ సినిమాకు సంగీత దర్శకునిగా అనిరుధ్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
- Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
తాజావార్తలు
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
-
Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
-
Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!