NTV Telugu Site icon

Constable Dismissed: వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షలను కాజేసిన కానిస్టేబుల్‌

Panjagutta

Panjagutta

Constable Dismissed: దారి దోపిడి కేసులో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సర్వీసు నుంచి తొలగించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షల నగదును ఏఆర్‌ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ కాజేసినట్లు విచారణలో తేలింది. ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఆర్‌ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ చట్టవిరుద్ధమైన, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలుసుకుని.. 2018 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్‌ను సర్వీసు నుంచి రాచకొండ సీపీ తొలగించారు. పోలీసు సిబ్బంది ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన, విధుల పట్ల నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ హెచ్చరించారు.

Also Read: Congress: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి.. పెరుగుతున్న అసమ్మతి స్వరం

అసలేం జరిగిందంటే.. ఎన్నికల దృష్ట్యా 26వ తేదీన ఓ కారును తనిఖీ చేయాలని బైక్‌పై యూనిఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు అడ్డగించారు. కారులో ఉన్న మహిళ నుంచి రూ.18,50,000/- డబ్బులు వసూలు చేసి వెళ్లిపోయారు. బాధితురాలు అర్ధరాత్రి 12:40 గంటలకు పంజాగుట్ట పీఎస్‌కి వెళ్లి జరిగిన సంఘటనను వివరిస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయబడింది. ఈ సంఘటనపై రాచకొండ పోలీస్ కమీషనర్ విచారించగా.. పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రమేయంపై వాస్తవాలు తెలుసుకుని క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అతనిని సర్వీస్ నుండి తొలగించి కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే పోలీసు సిబ్బంది ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.