Site icon NTV Telugu

Aqua Line: ముంబైలో మొదలైన మొదటి భూగర్భ మెట్రో..

Aqua Line In Mumbai

Aqua Line In Mumbai

Aqua Line In Mumbai: ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు ఈరోజు నుంచి ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్‌జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- SIPZ లైన్ అని కూడా పిలుస్తారు. దీని పని 2017లో ప్రారంభమైంది. ఈ మార్గంలో ముంబై మెట్రో ఆరే కాలనీ నుండి కఫ్ పరేడ్ వరకు 27 స్టేషన్ల మధ్య నడుస్తుంది. రైలు కఫ్ పరేడ్, విధాన్ భవన్, చర్చ్‌గేట్, హుతాత్మా చౌక్, CST మెట్రో, కల్బాదేవి, గిర్గావ్, గ్రాంట్ రోడ్, ముంబై సెంట్రల్ మెట్రో, మహాలక్ష్మి, సైన్స్ మ్యూజియం, ఆచార్య ఆత్రే చౌక్, వర్లీ, సిద్ధివినాయక్, దాదర్, సీతాలాదేవి, ధారవి, శాంతా, విద్యానగరి క్రజ్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్, సహర్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మరోల్ నాకా, MIDC, SEEPZ , ఆరే డిపో స్టేషన్స్ లో పరుగులు పెడుతుంది.

Telangana Assembly: ఆ విషయాలపై దద్దరిల్లిన అసెంబ్లీ..

ఇక ఈ మెట్రో సర్వీసు సమయాలు ఉదయం 6:30 నుండి రాత్రి 11:00 గంటల వరకు ఉంటాయి. మెట్రో మార్గంలో ప్రతి కొన్ని నిమిషాలకు రైళ్లు నడుస్తూనే ఉంటాయి. రైళ్లు గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. దీని కారణంగా 35 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం దాదాపు 50 నిమిషాల్లో పూర్తవుతుంది. రోడ్డు మార్గంలో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది.

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

సొరంగం రెండో దశతో సహా మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) దీన్ని నిర్వహించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ అయిన ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నిర్వహిస్తోంది. ఇది ప్రధానంగా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ద్వారా 21,280 కోట్ల రూపాయల రుణాన్ని పొందింది.మొత్తం రూ.37,275 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 98 శాతం పనులు పూర్తయ్యాయి.

Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?

ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్‌ఫారమ్‌పై ఎస్కలేటర్లు, లిఫ్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదాల నుంచి ప్రయాణికులను రక్షించేందుకు స్క్రీన్ డోర్లను తయారు చేశారు. వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం బ్రెయిలీ బటన్‌లు, 3 సైడ్ హ్యాండ్‌ రైల్స్, ఆడియో – విజువల్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, వీల్‌చైర్ యాక్సెస్, ఎమర్జెన్సీ బటన్లు ఉన్నాయి. ప్రయాణీకులకు ఎక్కువ ప్రయోజనం సమయం ఆదా రూపంలో ఉంటుంది. దక్షిణ ముంబై నుండి నగరం పశ్చిమ శివారు ప్రాంతాలకు ప్రయాణించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.

Exit mobile version