ఏపీ సచివాలయంలో ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం అయింది. ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు సాధికారిత కమిటీని జగన్ సర్కార్ నియమించింది. ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజులతో పాటు అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కూడా ఉన్నారు. వీరితో పాటు సంబంధిత శాఖల ఉన్నాతాధికారులు హాజరైయ్యారు.
Read Also: Leo: బ్రేకింగ్: లియో రిలీజ్ 19నే.. నాగవంశీ కీలక ప్రకటన
ఈ సందర్భంగా ఆక్వా సాధికారత కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈ కమిటీ వల్ల ఇప్పటి వరకు ఆరు సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగాం అని తెలిపారు. గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేదు.. దీని వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు.. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదొడుకులకు స్థానికంగా ఆక్వారంగం ఇబ్బందులను చవిచూసింది అని వారు తెలిపారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సాధికారిత కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Read Also: AP Cabinet Sub Committee: భూహక్కు-భూరక్షపై 15వ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రాష్ట్రంలో మొత్తం 4.65 లక్షల ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో ఉంది అని సాధికారిత కమిటీ సభ్యులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,433 ఆక్వా కనెక్షన్ లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నాం.. వచ్చే నెలలో అదనంగా మరో 4230 కనెక్షన్ లకు విద్యుత్ సబ్సిడీ.. 100 కౌంట్ రొయ్యలకు కేజీ రూ.240 ధర ఖరారు.. స్థానిక మార్కెట్ లో ప్రతినెలా 1000 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరుగుతున్నాయి.. ఆక్వా హబ్ ల ద్వారా స్థానిక మార్కెట్ లో వినియోగంను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలి అని సాధికారిత కమిటీ మెంబర్స్ అన్నారు.