Site icon NTV Telugu

APSRTC Special Buses: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ..

Apsrtc

Apsrtc

APSRTC Special Buses: దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ వాసులకు శుభవార్త చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించడమే కాదు.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్టు వెల్లడించి గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఈ నెల 15వ తేదీ నుంచి 2,700 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు పేర్కొంది.. ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అంటే ఏపీకి వెళ్లినవారి తిరుగు ప్రయాణాల కోసం 2,800 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది.. ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సులు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా తిరుగుతాయని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుబులు చెబుతున్నారు.. మొత్తంగా 5500 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.. ఇక, స్ధానికంగా జిల్లాల నుంచి విజయవాడకు 880 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది ఏపీఎస్ఆర్టీసీ.. బస్సులకు సంబంధించిన సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా 0866-2570005, 149 నంబర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

Read Also: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ ప్రారంభోత్సవ వేడుకలు లేనట్టేనా.. కారణమేంటీ?

కాగా, దసరా వచ్చిందంటే చాలు.. ఇళ్లకు వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు.. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి వరుసలో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రక‌టించారు. అక్టోబ‌ర్ 13వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని.. అలాగే తెలంగాణ‌లోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని వెల్లడించారు.. మరోవైపు.. ఏపీలో అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో దసరా సెలవులు వచ్చేస్తున్నాయి.. దీంతో.. ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.

Exit mobile version