కార్గో మాసోత్సవాల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు 35 పుస్తకాలను కార్గో డోర్ డెలివరీ చేశారు. సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు బాధ్యతగా డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకున్నాను అని ఆయన తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సేవలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ వస్తోంది అని ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. కార్గో సేవలను మరింత విస్తృత పరిచేందుకు కార్గో మాసోత్సవాలను జరుపుకుంటున్నాం.. ప్రైవేట్ కొరియర్, పార్శిల్ సర్వీసుల కంటే అతి తక్కువ ధరలకే కార్గో సేవలు అందిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు చెప్పుకొచ్చారు.
Read Also: RX 100 : మరోసారి రిపీట్ కానున్న ఆ సూపర్ హిట్ కాంబో..?
గత ఆరేళ్లుగా కార్గో రేట్లను కూడా పెంచలేదు అని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. బస్సు టిక్కెట్ రేట్లు పెరిగినా కార్గో రేట్లను పెంచలేదు.. ధరలు పెంచకపోయినా ప్రజల ఆదరణతో ఆదాయం పెరుగుతోంది అని ఆయన పేర్కొ్న్నారు. 2021-22 ఏడాదిలో 122 కోట్ల ఆదాయం సమకూరింది.. 2022-23 ఏడాదిలో 163 కోట్ల ఆదాయం సాధించాం.. ఏపీతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు వెళ్లే ఇతర రాష్ట్రాలకు కార్గో సేవలు అందిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.
Read Also: Chetan Gonaik: ఒక్క చేతితో సంక్షేమం.. మరో చేతితో అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్‌కి మాత్రమే ఉంది
ఈ ఆర్ధిక సంవత్సరం 200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు అన్నారు. డోర్ డెలివరీకి మరింత ఆదరణ పెంచేందుకు మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.. ఉద్యోగులంతా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం.. త్వరలోనే కార్గోలో ఎక్స్ ప్రెస్ సర్వీసు సేవలు పెట్టాలని భావిస్తున్నామన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ మాదిరి అతి తక్కువ ధరలకు కార్గో సేవలు ఎవరూ అందించడం లేదు అని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు.