సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ.. సంక్రాంతి పండుగకు నడిపే బస్సులో ప్రయాణీకులపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని సంస్థ ఎండీ ప్రకటించారు. అలాగే.. రానూపోనూ టికెట్లు ఒకేసారి ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా కల్పించింది. ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులను అధిక సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరవేసి రికార్డు సాధించింది. దీంతో సంస్థను లాభాల్లోకి వెళ్లింది.
Read Also: Double Murder : నార్సింగి జంట హత్యల కేసులో నివ్వెరపోయే విషయాలు
ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పటి వరకూ ఏపీఎస్ఆర్టీసీలో సంక్రాంతికి 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో.. ఇప్పటి వరకూ రూ.12 కోట్ల ఆదాయం ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ. సుమారుగా రూ.12.5 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తుంది ఏపీఎస్ఆర్టీసీ సంస్థ. అయితే.. ఇంకెంత మంది జనాలు తమ సొంతూర్లోనే ఉండిపోయారు. దీంతో.. తిరుగు ప్రయాణాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. మరింత ఆదాయం వస్తుందని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. గత సంవత్సరం రాను పోను కలిపి రూ.12 కోట్లు ఆదాయం ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ. గత సంవత్సరం ప్రయాణించిన 4.3 లక్షల మంది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేశారు.
Read Also: Justin Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాలకు ట్రూడో గుడ్ బై..