Site icon NTV Telugu

APSRTC: స్త్రీశక్తి పథకం ఎఫెక్ట్.. ఉద్యోగుల భత్యాల పెంపు!

Apsrtc

Apsrtc

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ స్త్రీశక్తి పథకం విజయవంతం చేయడంలో భాగంగా.. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు స్వాగతించారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థికాభివృద్ధి, ఉత్సాహం పెంపుదల దిశగా దోహదం చేస్తాయని వారు తెలిపారు. స్త్రీశక్తి పథకం విజయవంతం కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ఆర్టీసీ ఇ.యూ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగుల కోసం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.

Vivo G3 5G: ఐదేళ్ల బ్యాటరీ వారంటీ, డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌తో వివో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర ఇలా!

స్త్రీశక్తి పథకం విజయవంతానికి ఆర్టీసీ ఉద్యోగులకు ఎం.డి కీలక నిర్ణయాలు పట్ల ఆర్టీసి ఇ.యు నాయకులు హర్షం.

👉 డబుల్ డ్యూటీ చేసే కండక్టర్ల భత్యం రూ.700 నుండి రూ.900కి పెంపు.

👉 డ్రైవర్ల భత్యం రూ.800 నుండి రూ.1000 కి పెంపు – ఆన్‌కాల్ డ్రైవర్లకూ వర్తింపు.

👉 అదనపు కిలోమీటర్లకు రూ.3 చొప్పున డ్యూటీ పూర్తయ్యాక చెల్లింపు.

👉 స్త్రీశక్తి పథకం ఆదాయానికి అనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్లకు ఇన్సెంటివ్‌లు ఇచ్చేలా నిర్ణయాలు.

APPAR ID: CBSE కీలక నిర్ణయం.. ఇకపై విద్యార్థులకు ఆ ఐడి లేనట్లయితే బోర్డు పరీక్షలు రాయలేరు!

Exit mobile version