NTV Telugu Site icon

Group-2 Notification: నిరుద్యోగులకి శుభవార్త.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

Appsc

Appsc

Group-2 Notification: నిరుద్యోగులకి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు.. అందులో కొన్ని భర్తీ కాగా.. మరికొన్ని ఫలితాల వరకు వచ్చాయి.. ఇప్పుడు గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు.. ఇక, గ్రూప్‌ -2 పరీక్షలకు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఈ పరీక్షల కోసం 2023 డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు..

Read Also: Pawan Kalyan: సీఎం పదవిపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..

Show comments