Site icon NTV Telugu

TDP: 14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ నియామకం

Tdp

Tdp

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ నియామకమైంది. 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ జనసేనతో సమన్వయం చేసుకోనుంది. ఇప్పటికే జనసేన వైపు నుంచి సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు.

Also Read: Vandebharat Express: మరో 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

పొలిటికల్ యాక్షన్ కమిటీలో సభ్యులు వీరే..
1. యనమల రామకృష్ణుడు
2. కింజరాపు అచ్చెన్నాయుడు
3. చింతకాయల అయ్యన్నపాత్రుడు
4. ఎంఏ షరీఫ్
5. పయ్యావుల కేశవ్
6. నందమూరి బాలకృష్ణ
7. నిమ్మల రామానాయుడు
8. నక్కా ఆనంద్‌బాబు
9. కాల్వ శ్రీనివాసులు
10. కొల్లు రవీంద్ర
11. బీసీ జనార్దన్ రెడ్డి
12. వంగలపూడి అనిత
13. బీడ రవిచంద్ర యాదవ్
14. నారా లోకేష్

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు పొలిటికల్ యాక్షన్ కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, టీడీపీ కార్యక్రమాలు, రాష్ట్రంలో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version