Appointment of SPs for Three Districts in Andhra Pradesh: ఏపీలో మూడు జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఈసీ ఆదేశించింది. వెంటనే వారు బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియమించిన సంగతి తెలిసిందే.
Read Also: Palnadu: పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియామకం.. ఈసీ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం.. ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకువాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది.