Site icon NTV Telugu

CEC bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు ఆమోదం..

Cec Bill

Cec Bill

రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లును ఆమోదించుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్‌ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్రమంత్రి ఉండనున్నారు. అయితే, కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. ఆ మంత్రి పేరును కూడా ప్రధాన మంత్రినే నామినేట్‌ చేయనున్నారు. తద్వారా 1991 చట్టాన్ని కేంద్ర సర్కార్ పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే, గత మార్చి నెలలో సుప్రీం కోర్టు ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసే వరకు.. ప్రధాన మంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పు వెల్లడించింది.

Read Also: Bhajan Lal Sharma: “సర్పంచ్ నుంచి సీఎం దాకా”.. రాజస్థాన్ సీఎం అద్భుత రాజకీయ ప్రస్థానం..

కాగా, ఇవాళ రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉండబోతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లుగానే ఉందని తెలిపారు. ఇక, రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటవుతుంది. దీంట్లో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్‌ మంత్రి సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రతిపాదిత కమిటీ పైనా విపక్షాలు అభ్యంతరం చేశాయి.

Read Also: CM Revanth Reddy: పకడ్బందీగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ..

అయితే, వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తారీఖున రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ కొనసాగలేదు.. ఆ తర్వాత సెప్టెంబర్ లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని అనుకున్నారు.. కానీ, అది సాధ్యం కాలేదు.. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభలో ప్రవేశ పెట్టడంతో పాటు చర్చ జరిగింది.. దీనికి విపక్షాల అభ్యంతరాల చేప్ప్తుండగానే ఆమోదం పొందింది.

Exit mobile version