NTV Telugu Site icon

Telangana: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయ, పర్యవేక్షణ అధికారుల నియామకం..

Samagra Kutumba Survey

Samagra Kutumba Survey

హైదరాబాద్‌లో కుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు ఎన్యూమరేటర్లు. మొదటి దశలో మూడు రోజులపాటు ఇంటింటికి వెళ్లి స్టిక్కరింగ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కరింగ్ 95 శాతం పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 19,722 ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈరోజు నుంచి 21 వరకు ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు.

Read Also: Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఆఫీసులో..!

అందులో భాగంగానే.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయ, పర్యవేక్షణ అధికారులను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే సమన్వయ అధికారిగా హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. సికింద్రాబాద్, చార్మినార్ జోన్‌లకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ శ్రీవత్స కోట.. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్‌లకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్‌లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌ను నియమించారు.

Read Also: Chada Venkata Reddy: జమిలి ఎన్నికలు అసాధ్యం.. ప్రజలను గందరగోళం చేయొద్దు