NTV Telugu Site icon

Health Tips: ప్రతి రోజూ రెండు చుక్కల నెయ్యి మీ ముక్కులో వేసుకుంటే ఈ సమస్యలు మాయం..!

Ghee

Ghee

నెయ్యిలోని పోషకాల గురించి అందరికీ తెలిసిందే.. నెయ్యిని తినాలంటే రోటీలో కానీ పప్పు అన్నంలో కానీ ఎక్కువగా తింటూ ఉంటారు. అంతేకాకుండా.. నెయ్యిని తీపి వంటకాలు, మసాల వంటకాలల్లో వాడుతారు. ఇక చిన్నపిల్లలకు నెయ్యి లేకుండా అన్నం పెట్టరు చాలా మంది. నెయ్యి తినడం వల్ల మన శరీరంలోని ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. నెయ్యితో మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే నెయ్యి తినడమే కాకుండా ముక్కులో కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ముక్కులో రెండు చుక్కలు వేసుకుంటే అద్బుతం జరుగుతుంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ముక్కులో 2 చుక్కల నెయ్యి వేస్తే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Read Also: Nedurumalli Ram kumar: పిలవని పేరంటాలకు వచ్చేస్తాడు.. ఆనంపై నేదురుమల్లి ఫైర్

ఆయుర్వేదం ప్రకారం.. ముక్కులో నెయ్యి వేయడం వల్ల ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవు నెయ్యిని ముక్కులో వేసుకోవడం వల్ల మైగ్రేన్, సర్వైకల్ స్పాండిలోసిస్ మొదలైన శరీర నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో విటమిన్ ‘ఎ’ ఉంటుంది. ఇది మెదడుకు పోషణనిస్తుంది.. అంతేకాకుండా కంటి చూపును బలపరుస్తుంది. రాత్రిపూట ముక్కుపై ఆవు నెయ్యి రాసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాభిపై నెయ్యి రాయడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముక్కు ద్వారా నెయ్యిని అప్లై చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, అసాధారణ వ్యాధులు మొదలైన వాటిని కూడా నయం చేయవచ్చు. ఖాళీ కడుపుతో ముక్కులో నెయ్యి రాసుకోవడం మంచిది. అందుకే ఉదయం ఉత్తమ సమయం. అయితే ఉదయం సమయం దొరక్కపోతే రాత్రి పడుకునే ముందు వేసుకోవచ్చు.

NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..