Site icon NTV Telugu

RBI Assistant Vacancy 2026: ఆర్బీఐలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. మంచి జీతం.. ఫీజు రూ. 50 మాత్రమే!

Rbi

Rbi

స్టేట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాళీగా ఉన్న 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైంది.. మార్చి 8, 2026 వరకు కొనసాగుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 346 జనరల్‌కు, 58 EWSకు, 99 OBCకి, 110 SCకి, 37 STకి రిజర్వ్ చేయబడ్డాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ పై క్లిక్ చేయండి.

Also Read:Jai Hanuman : హంపి వేదికగా ‘జై హనుమాన్’ గ్రాండ్ లాంచ్.. రిషబ్ శెట్టితో రానా దగ్గుబాటి స్క్రీన్ షేర్?

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- ఫిబ్రవరి 16, 2026
దరఖాస్తు చివరి తేదీ -మార్చి 8, 2026
ప్రాథమిక పరీక్ష తాత్కాలిక తేదీ -ఏప్రిల్ 11, 2026
మెయిన్స్ పరీక్ష తాత్కాలిక తేదీ -జూన్ 7, 2026

Also Read:Jeep Meridian Track Edition: జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్‌ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా

అర్హతలు

ఈ నియామకంలో పాల్గొనడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారికి కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. అదనంగా, అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు. అంటే ఫిబ్రవరి 2, 1998 కంటే ముందు, ఫిబ్రవరి 1, 2006 కంటే తరువాత జన్మించి ఉండాలి. అయితే, రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, జనరల్, OBC, EWS వర్గాల అభ్యర్థులు రూ.450 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST , PH వర్గాలకు, రుసుము రూ.50 మాత్రమే. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,000 ప్రారంభ మూల వేతనం లభిస్తుంది. ప్రస్తుతం, అసిస్టెంట్ కోసం ప్రారంభ నెలవారీ స్థూల జీతం (HRA లేకుండా) సుమారు రూ.58,514/- ఉంటుంది. వారు బ్యాంకు వసతి గృహంలో ఉండకపోతే, జీతంలో 15% ఇంటి అద్దె భత్యం అదనంగా చెల్లిస్తారు.

Exit mobile version