Site icon NTV Telugu

SSC Phase 13 Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. ఎస్ఎస్ సీలో 2423 జాబ్స్.. మిస్ చేసుకోకండి

Ssc

Ssc

జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఎస్ఎస్ సీ ఫేజ్ 13 (సెలక్షన్ పోస్టుల పరీక్ష 2025) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2423 పోస్టులను భర్తీచేయనున్నారు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు పోటీపడొచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి/12వ తరగతి/గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Also Read:Toxins : బాడీలోని టాక్సిన్స్‌ని బయటకుపంపే 7 అద్భుతమైన కషాయాలు..

ఆగస్టు 1, 2025ని దృష్టిలో ఉంచుకుని వయస్సును లెక్కిస్తారు. జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100గా నిర్ణయించారు. SC/ST, PH కేటగిరీ అభ్యర్థులు ఈ నియామకానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 23 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version