PGCIL Recruitment 2025: BTech పాసైతే చాలు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 1543 జాబ్స్ రెడీ..
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 1543 జాబ్స్
- BE, BTech, BSc ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
- సెప్టెంబర్ 17, 2025 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1543 పోస్టులను భర్తీ చేయనున్నారు. పవర్ గ్రిడ్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి BE, BTech, BSc ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇది కాకుండా, అభ్యర్థులు ఇతర నిర్దేశిత అర్హతలను కూడా కలిగి ఉండాలి.
Also Read: Ukraine-Russia: రష్యా డ్రోన్ దాడి.. సముద్రంలో ఉక్రెయిన్ భారీ నౌక పేల్చివేత
Also Read
అభ్యర్థుల గరిష్ట వయస్సు 29 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో, అభ్యర్థులను టెక్నికల్, ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ నిబంధన లేదు.
Also Read:Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం అందిస్తారు. అలాగే, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఇస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 17, 2025 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?