బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
Also Read:Mohammed Siraj: ప్రేమాయణం అంటూ పుకార్లు.. రాఖీతో చెక్ పెట్టిన సిరాజ్
ఈ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి మెట్రో ప్రాంతాల్లో రూ. 15 వేలు, అర్భన్ ప్రాంతాల్లో రూ. 12 వేలు, సెమీ అర్భన్ లేదా రూరల్ ఏరియాల్లో రూ. 10 వేలు అందిస్తారు. జనరల్, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.944 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708 ఫీజు నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 20 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.