Site icon NTV Telugu

BOI SO Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు.. నెలకు శాలరీ రూ. లక్ష కంటే ఎక్కువ

Jobs

Jobs

బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 60% (లేదా తత్సమానం) మార్కులతో BE/B.Tech (CS/IT/ECE), MCA, లేదా M.Sc ఉత్తీర్ణులై ఉండాలి. ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, LLB కలిగి ఉండాలి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి 25 నుంచి 45 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read:Smriti Mandhana Haldi: స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి బాజాలు.. మొదలైన హల్దీ సెలబ్రేషన్స్

రాత పరీక్షలో ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 125 మార్కులకు. పరీక్ష వ్యవధి 100 నిమిషాలు. అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి గ్రేడ్ స్కేల్-II నెలకు రూ. 64,820 నుండి రూ. 93,960, గ్రేడ్ స్కేల్-III నెలకు రూ. 85,920 నుండి రూ. 1,05,280, గ్రేడ్ స్కేల్-IV నెలకు రూ. 1,02,300 నుండి రూ. 1,20,940 జీతం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు SC/ST, వికలాంగ అభ్యర్థులకు రూ. 175, ఇతర అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version