మంచి శాలరీ వచ్చే జాబ్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన సంస్థలో భారీగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 682 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ITI, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్-గ్రాడ్యుయేషన్, CA, MBA, MTech లేదా తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి.
Also Read:Food Colors: ఫుడ్ కలర్స్ వాడటంతో కలిగే నష్టాలేంటి..? నిపుణులు చేస్తున్నహెచ్చరికలేంటి ?
అభ్యర్థుల వయస్సు స్టాఫ్ నర్స్ & ఫార్మసిస్ట్ 25-35 సంవత్సరాలు, నాన్-ఎగ్జిక్యూటివ్: 18-30 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులు (డిప్లొమా/ITI) నిబంధనల ప్రకారం, మేనేజ్‌మెంట్ ట్రైనీ 27 సంవత్సరాలు, సీనియర్ మేనేజ్‌మెంట్ 50-55 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ 3 సంవత్సరాలు సడలింపు, SC/ST లకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ రూ. 500 చెల్లించాలి. SC/ST/PwBD/మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Botsa Satyanarayana: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం మౌనం..
ఎంపికైన వారికి సెక్యూరిటీ & ఫైర్ గార్డ్స్ లకు నెలకు రూ. 22,000 – రూ. 25,000, స్టాఫ్ నర్స్ & ఫార్మసిస్ట్ నెలకు రూ. 29,200- రూ. 62,000, నాన్-ఎగ్జిక్యూటివ్ నెలకు రూ. 23,000 – రూ. 27,000, తాత్కాలిక ఉద్యోగులు (డిప్లొమా/ఐటీఐ) నెలకు రూ. 20,000 – రూ. 24,000, మేనేజ్‌మెంట్ ట్రైనీ నెలకు రూ. 40,000 – రూ. 1,40,000, సీనియర్ మేనేజ్‌మెంట్ నెలకు రూ. 70,000 – రూ. 2,60,000 జీతం అందిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 25 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
