బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ రిస్క్ మొదలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 330 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, BE, BTech, ME, MTech లేదా కంప్యూటర్ సైన్స్‌లో MSc కలిగి ఉండాలి. అలాగే, అభ్యర్థులు వారి పోస్టుకు సంబంధించిన ఇతర నిర్దేశిత అర్హతలను కలిగి ఉండాలి.
Also Read:Off The Record: ఏపీ బీజేపీ స్వరం మారుతోందా?
పోస్టులను అనుసరించి అభ్యర్థుల కనీస వయస్సు 22, 23, 24, 25, 26, 27 28, 30, 31 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే, గరిష్ట వయస్సును పోస్టును బట్టి 32, 34, 35, 40, 41, 45, 35, 36, 38, 48 సంవత్సరాలుగా నిర్ణయించారు. అభ్యర్థులకు వయోపరిమితిలో కూడా సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:YS Jagan Nellore Tour: నెల్లూరు చేరుకున్న జగన్.. హరిత హోటల్ దగ్గర ఉద్రిక్తత..
జనరల్ EWS లేదా OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుగా రూ. 850. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 19 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
