సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. సహాయ కార్యదర్శి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను బట్టి 27 నుంచి 35 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
Also Read:Varanasi: ‘వారణాసి’ గ్లింప్స్‌పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!
ఈ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. SC/ST/దివ్యాంగులు/మాజీ సైనికులు/మహిళా అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి, జనరల్/OBC/EWS అభ్యర్థులు గ్రూప్ A కోసం రూ.1750, గ్రూప్ B, C కోసం రూ.1050 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఫీజులను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 22, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
