గవర్నమెంట్ జాబ్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే అభ్యర్థులు లక్షల్లో పోటీపడుతున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మొత్తం 156 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ గ్రైండర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ R&AC, టర్నర్, వెల్డర్ ట్రేడుల్లో భర్తీకానున్నాయి.
Also Read:Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
అభ్యర్థులు 10వ తరగతి/SSC ఉత్తీర్ణులై ఉండాలి. ITI కూడా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది. డిసెంబర్ 8, 2025 నాటికి వయస్సును లెక్కిస్తారు. ఎంపిక మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది. మెరిట్ జాబితా 10వ తరగతి, ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఈ జాబితాకు ఎంపికైన అభ్యర్థులు వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి.
Also Read:Hema Malini-Dharmendra : నా బాధ వర్ణించలేనిది.. ధర్మేంద్ర మరణంపై హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్
అభ్యర్థులు https://apprenticeshipindia.gov.in/candidate-registration పోర్టల్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడు, అభ్యర్థులు తమ 10వ తరగతి, ఐటీఐ, కుల ధృవీకరణ పత్రాల (ఒరిజినల్) స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, ఫారమ్ హార్డ్ కాపీని, అవసరమైన పత్రాలను నిర్దేశించిన చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 8, 2025. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
