NTV Telugu Site icon

iPhone 15 : యాపిల్ మేక్ ఇన్ ఇండియా.. అతి తర్వలోనే ఐఫోన్ 15

Iphone

Iphone

iPhone 15 : ఐఫోన్‌లను విక్రయించే సంస్థ ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. యాపిల్ మేడ్ ఇన్ ఇండియా డివైస్‌లను గతంలో కంటే చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు. యాపిల్- మేకర్ ఫాక్స్‌కాన్ కంపెనీ తమిళనాడు సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో గతంలో కంటే వేగంగా ఐఫోన్ 15 స్థానిక ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. Apple లక్ష్యం స్థానికంగా అసెంబుల్ చేయబడిన iPhone 15 ను వచ్చే నెల మధ్యలో అంతర్జాతీయంగా విడుదల చేయాలని పట్టుదలతో ఉంది. వెంటనే ఐఫోన్ 15 పంపిణీ, పోస్ట్-లాంచ్ సులభం అవుతుంది. భారతదేశం నుండి ఇతర దేశాలకు వేగవంతంగా ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చు.

Read Also:Point Blank Shot: చిన్నారిని భుజాలపై మోసుకెళ్తుతున్న తండ్రి… పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపిన దుండగులు

భారతదేశంలోని పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఇతర ఆపిల్ ఉత్పత్తి సరఫరాదారులు కూడా ఐఫోన్ 15ను త్వరగా అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తారు. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 15కి సంబంధించిన నివేదికను బ్లూమ్‌బెర్గ్ మొదట విడుదల చేసింది. గతేడాది ఆపిల్ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో సెప్టెంబర్‌లో ఐఫోన్ 14ని అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. గ్లోబల్ లాంచ్ అయిన కొన్ని వారాల తర్వాత భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి.

Read Also:Chiru: కళ్యాణ్ కృష్ణ అవుట్? మెగాస్టార్ కోసం రంగంలోకి దిగిన స్టార్ డైరెక్టర్…

ఐఫోన్‌ అంటే ప్రస్తుతం మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదు ఎంతైనా కొనుగోళ్లు భారీగానే ఉన్నాయి. భారతదేశంలో జూన్ త్రైమాసికంలో కంపెనీ రికార్డు సృష్టించినట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు. కొంతకాలం క్రితం యాపిల్ తన ఆపిల్ స్టోర్లను భారతదేశంలో ముంబై, ఢిల్లీ నుండి ప్రారంభించింది. భారతదేశంలో కొత్త స్టోర్ పనితీరు తమ అంచనాలను మించిపోయిందని కుక్ అన్నారు.

Show comments