Apple Stocks Down: ఆపిల్ కంపెనీకి షాక్.. 200 బిలియన్ డాలర్లు నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Stocks Down: యాపిల్ కంపెనీ తన పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. కేవలం 2 రోజుల్లోనే Apple షేర్లు బాగా క్షీణించాయి.ఈ కంపెనీ మార్కెట్ విలువ మొత్తం 200 బిలియన్ డాలర్లు తగ్గింది. ఆపిల్ షేర్లు కేవలం 2 రోజుల్లోనే 6.8 శాతం పడిపోయాయి. ఇందులో 5.1 శాతం క్షీణత ఒక్క గురువారం ట్రేడింగ్ సెషన్లో కనిపించింది.
ఆపిల్ షేర్లు ఎందుకు పడిపోయాయి?
యాపిల్ షేర్ల పతనం వెనుక చైనా కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ-మద్దతు గల ఏజెన్సీలు, రాష్ట్ర కంపెనీలలో ఐఫోన్ వినియోగాన్ని నిషేధించే ప్రణాళిక చైనాలో పరిగణించబడుతోంది. దేశంలోని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఆధారిత కంపెనీల్లోని సభ్యులు.. ఐఫోన్స్‌ని వాడకూడదని.. కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది చైనా. ఈ నిషేధాన్ని ఇతర రంగాలకు కూడా విస్తరించే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే అమెరికాకు చెందిన కాలిఫోర్నియా కంపెనీ యాపిల్ భారీ నష్టాలను చవిచూడవచ్చు. ఈ భయం కారణంగా యుఎస్ మార్కెట్లలో ఈ జెయింట్ టెక్ కంపెనీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. ఆపిల్ మార్కెట్ క్యాప్‌లో భారీ కోత ఏర్పడింది.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Read Also:Wi-Fi Router : నైట్ Wi-Fi రూటర్‌ని ఆఫ్ చేయడం లేదా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..
ఐఫోన్ తయారీదారు ఆపిల్ చైనాను తన రెండవ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా పరిగణిస్తుంది. చైనా కూడా దాని ప్రపంచ ఉత్పత్తి స్థావరంగా కంపెనీకి చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. చైనాలో ఈ ప్రభుత్వ ఆంక్షలు అమలు చేస్తే, కంపెనీ ఖచ్చితంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
యాపిల్ షేర్ల పరిస్థితి ఎలా ఉంది?
ఐఫోన్ తయారీదారు ఆపిల్ షేర్లు గురువారం 5.1 శాతం క్షీణించాయి. అంతకుముందు రోజు అంటే బుధవారం, దాని స్టాక్స్ సుమారు 2 శాతం పడిపోయాయి. అందువల్ల, రెండు రోజుల్లో ఆపిల్ స్టాక్స్ సుమారు 7 శాతం పడిపోయాయి. దీని కారణంగా కంపెనీ 200 బిలియన్ డాలర్లను కోల్పోయింది. నిన్న అమెరికా మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి Apple షేర్లలో రికవరీ తిరిగి వచ్చింది. ఇది 2.92 శాతంతో 177.56 అమెరికన్ డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్‌లలో బాండ్ల విక్రయం వంటి ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావాన్ని కంపెనీ భరించవలసి ఉంటుంది. కాబట్టి Apple షేర్లు మరింత పడిపోతున్నాయి. దీని కారణంగా పెట్టుబడిదారులు చిప్ కంపెనీలతో సహా యుఎస్ లిస్టెడ్ చైనా కంపెనీల షేర్లను విక్రయిస్తున్నారు.
Read Also:Non Vegetarian Food: ఐఐటీ మండీ డైరెక్టర్ వింత లాజిక్.. నాన్‌వెజ్ వల్లే ప్రకృతి విపత్తులు..!
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!