NTV Telugu Site icon

iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్‌ను అస్సలు మిస్ కావొద్దు!

Iphone 15 Pro Max

Iphone 15 Pro Max

iPhone 15 Price Cut: ‘యాపిల్’ తన కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయగానే పాత ఉత్పత్తుల ధరలు తగ్గించడం సాధారణం. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను తగ్గించింది. ఇక ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2024లో యాపిల్ ఉత్పత్తులపై అద్భుత ఆఫర్స్ ఉన్నాయి. మాక్ బుక్స్, యాపిల్ స్మార్ట్ వాచ్, ఐఫోన్ 15 వంటి వాటిపై భారీగా డిస్కౌంట్స్ ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తులను కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: T20 World Cup 2024: వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం!

ఐఫోన్‌ 15ను గతేడాది 128జీబీ వేరియంట్ ధర రూ.79,900కు లాంచ్‌ చేయగా.. ఐఫోన్‌ 16 సిరీస్‌ వచ్చాక ఆ ధరను రూ.69,900కు తగ్గించింది. ఈ ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో 12 శాతం తగ్గింపు ఉంది. బ్యాంకు ఆఫర్స్ అదనం. పదో జనరేషన్ యాపిల్ ఐప్యాడ్ పై 33 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 29,999గా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 10 జీపీఎస్‌పై 6 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర అమెజాన్‌లో రూ. 27,999గా ఉంది. యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ఎం1 చిప్‌పై 37శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ. 52,990కే కొనుగోలు చేయొచ్చు.

Show comments