Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Apple Launches 2025 Ipad And Ipad Air 7th Generation In India With Powerful A16 And M3 Chips

Apple Launches iPad: భారత్‌లో సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను విడుదల చేసిన యాపిల్

Published Date :March 5, 2025 , 4:39 pm
By Kothuru Ram Kumar
  • సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను భారత్‌లో విడుదల చేసిన యాపిల్
  • శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించి 2025 మోడల్ ఐప్యాడ్‌ను విడుదల.
  • M3 చిప్‌తో ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్‌.
Apple Launches iPad: భారత్‌లో సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను విడుదల చేసిన యాపిల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించారు. గత మోడల్స్‌తో పోలిస్తే, స్టోరేజ్‌ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా చూపిస్తుంది.

Read Also: Meenakshi Natarajan: పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది తెలుసు

ఇక ఇందులో వదిన A16 చిప్ టాబ్లెట్ పనితీరును, పవర్ ఎఫిషియెన్సీని బాగా పెంచుతుంది. పాత మోడల్స్‌తో పోలిస్తే స్పీడ్ 30 శాతం, ఓవరాల్ పనితీరు 50 శాతం పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల కంటే ఇది ఆరు రెట్లు వేగవంతంగా ఉంటుంది. A16 చిప్‌లో 5-కోర్ CPU, 4-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. ఇక ఈ ఐప్యాడ్‌లో కెమెరా, డిస్‌ప్లే ఫీచర్ల విషయానికి వస్తే.. వెనుక వైపు 12MP కెమెరా ఉంది. ముందు వైపు 12MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెంటర్ స్టేజ్ ఫీచర్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్స్‌లో కదులుతున్నా, ఫోకస్‌లో ఉంచుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 128GB రూ.34,900, 256GB రూ.44,900, 512GB రూ.64,900గా ఉన్నాయి. సెల్యులార్ మోడల్ 128GB ధర రూ.49,900. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఇక మరోవైపు, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్‌ను కూడా విడుదల చేసింది. ఇది M3 చిప్‌తో వస్తోంది. దీనిని రెండు సైజుల్లో (11 అంగుళాలు, 13 అంగుళాలు) విడుదల చేసారు. M3 చిప్‌లో 8-కోర్ CPU, 9-కోర్ GPU ఉండడంతో అవి.. CPU పనితీరును 35%, గ్రాఫిక్స్ 40% మెరుగుపరుస్తుందని ఆపిల్ పేర్కొంది. ఈ టాబ్లెట్ యాపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ పనుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. మ్యాజిక్ కీబోర్డ్, యాపిల్ పెన్సిల్ (USB-C, ప్రో) వంటి యాక్సెసరీస్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Read Also: Dharmapuri Arvind: ట్రంప్ మోడీని కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నారు.. రేవంత్ ఓ లెక్కా!

ఇక దీని ధర విషయానికి వస్తే.. 11 అంగుళాల వై-ఫై మోడల్ (128GB) ధర రూ.59,900 కాగా.. 11 అంగుళాల వై-ఫై + సెల్యులార్ (128GB) మోడల్ ధర రూ.74,900. అలాగే13 అంగుళాల వై-ఫై మోడల్ రూ.79,900. ఇంకా 13 అంగుళాల సెల్యులార్ మోడల్ రూ.94,900 గా ఆపిల్ నిర్ణయించింది. మార్చి 12 నుంచి యాపిల్ అధికారిక వెబ్‌సైట్, స్టోర్లలో లభిస్తుంది. మొత్తం మీద కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ రెండు టాబ్లెట్లు శక్తివంతమైన చిప్‌సెట్లు, మెరుగైన డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌తో వచ్చాయి. ప్రొఫెషనల్స్, గేమర్స్, సాధారణ వినియోగదారులకు ఇవి మంచి ఛాయిస్ అవుతాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025 iPad
  • A16 Chip
  • Apple
  • Apple Launches iPad
  • iPad Air 7th Generation

తాజావార్తలు

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions