Site icon NTV Telugu

Apple iPhone vs Android: ఆపిల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్.. ఏది ఉత్తమం? ఎందుకు?

Apple Iphone Vs Android

Apple Iphone Vs Android

Apple iPhone vs Android: ప్రపంచంలో ఇప్పడు దాదాపు ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు అనడంలో ఎటువంటి ఆధ్శయోక్తి లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం దైనందిక జీవితంలో చాలావరకు పనులు మొబైల్ ఫోన్ వినియోగించి పూర్తి చేసుకోవడమే. ఇకపోతే ఇప్పుడు ఫోన్ కొనాలంటే మన ముందు నిలిచే పెద్ద డైలెమా.. ఆపిల్ ఫోన్ కొనాలా? లేక ఆండ్రాయిడ్ ఫోన్ లో బెస్ట్ దొరికేది చూసుకోవాలా? అని. నిజానికి ఈ రెండింటికీ వేరు వేరు శైలులు, లక్షణాలు, లాభనష్టాలు ఉన్నాయి.

Read Also:ENG vs IND: నువ్వు ఎక్కడికో వెళ్లిపోవాలి.. ప్రిన్స్‌ను మెచ్చుకున్న కింగ్!

ఇక మొదటగా ఆపిల్ ఫోన్ల గురించి చూస్తే.. ఇవి ప్రత్యేకమైన iOS సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇది చాలా స్మూత్, సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే, ఆపిల్ ఫోన్లు ప్రీమియం డిజైన్, లాంగ్‌ టర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మంచి కెమెరా క్వాలిటీతో వస్తాయి. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండడం కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి.

ఇక అదే ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికి వస్తే.. ఇవి విస్తృత ఎంపికలతో అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హైఎండ్ ఫోన్ల దాకా ఎన్నో బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమైజేషన్, మొబైల్ ఫీచర్ల వాడకంలో వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది ఆండ్రాయిడ్ మొబైల్. కానీ, అన్ని కంపెనీలు సమయానికి అప్డేట్స్ ఇవ్వవు. అలాగే సెక్యూరిటీ పరంగా కొన్ని బ్రాండ్లు అంత బలంగా ఉండకపోవచ్చు.

Read Also:Nidhi Agarwal: ఈసారి ఏం పూజలు చేసారో.. మరోసారి వేణు స్వామి ఆధ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన ముద్దుగుమ్మ..!

కాబట్టి, మీరు ఖర్చుపై తక్కువగా చూసుకుంటే లేదా ఎక్కువ ఆప్షన్స్ కోరుకుంటే ఆండ్రాయిడ్ బెస్ట్. అదే మీరు ఒక స్టేటస్, ప్రీమియం అనుభూతి కోరుకున్నా.. లేక హ్యాకింగ్ రిస్క్ లేని సురక్షితమైన ఫోన్ కావాలంటే ఆపిల్ ఫోన్ మీకు బెస్ట్ ఛాయస్ అవుతుంది. మొత్తంగా మీ అవసరాలు, బడ్జెట్, ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోవడమే సరైన నిర్ణయం.

Exit mobile version