iPhone 16 Price: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple iPhone 16 Series Launched: టెక్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. 16 సిరీస్ ఫోన్స్ ఏ18 చిప్‌తో వస్తున్నాయి. న్యూరల్ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్ గత సిరీస్‌ల కంటే రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని యాపిల్ ఈసీవో టిమ్ కుక్ తెలిపారు. 17 శాతం ఎక్కువ బ్యాండ్ విడ్త్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ మెమోరీ సబ్‌సిస్టమ్‌ను ఇది కలిగి ఉంటుంది.
iPhone 16 Series Features:
యాపిల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఐఫోన్‌లోని యాప్‌లను సులువుగా ఉపయోగించుకోచ్చు. అక్టోబర్‌లో బీటా వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్‌ను కంపెనీ విడుదల చేస్తోంది. అనంతరం చైనీస్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఇది విడుదల కానుంది. అయితే భారతీయ భాషలకు సంబంధించి యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక 16 సిరీస్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని యాపిల్ చెప్పినప్పటికీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెప్టెంబర్ 13 నుంచి ప్రీబుకింగ్‌లు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Also Read
iPhone 16 and iPhone 16 Plus Specs:
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు. గ్లాస్ బ్యాక్ ఫోన్లతో పోలిస్తే.. ఇది రెండు రెట్లు అధిక మన్నికగా ఉంటుంది. ఐఫోన్ 16 డిస్‌ప్లే 6.1 అంగుళాలు కాగా.. వెనిలా వేరియంట్‌తో రూపొందించారు. ఐఓఎస్ 18తో పనిచేస్తుంది. 2000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ డిస్‌ప్లే 6.7 అంగుళాలు. ఇందులో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. వెనకవైపు 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ కెమెరా ఉంది. కెమెరా కంట్రోల్ బటన్‌తో సులభంగా ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్ ఉంది. ఫోన్ 16లో ఏఏఏ గేమ్స్ ఆడుకోవడానికి అవకాశం కల్పించారు.
iPhone 16 Pro and iPhone 16 Pro Max Camera:
ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే 6.3 అంగుళాలు కాగా.. ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్‌ప్లే 6.9 అంగుళాలు. రెండు మోడళ్లలో అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఛాంబర్ ఫీచర్ ఉంది. డివైజ్‌లు హీట్ కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రో, ప్రో మాక్స్ మోడళ్లలో ఏ18 ప్రో చిప్ ఉంటుంది. వెనకవైపు రెండు 48 ఎంపీ కెమెరాలను ఇచ్చారు. ఇందులో ఒకటి 48 ఎంపీ ఫ్యూజన్ కెమెరా కాగా.. మరొకటి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. 12 ఎంపీ 5ఎక్స్ టెలిఫొటోతో ఫొటోలు తీయవచ్చు. ప్రో మోడళ్లలో 4k 120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయవచ్చు.
ఐఫోన్ 16 సిరీస్ ధరలు (iPhone 16 Series Prices in India):
# ఐఫోన్ 16 – రూ.79,900 (799 డాలర్లు- 128 స్టోరేజీ బేస్ మోడల్)
# ఐఫోన్ 16 ప్లస్ – రూ.89,900 (899 డాలర్లు-128 స్టోరేజీ బేస్ మోడల్)
# ఐఫోన్ 16 ప్రో – రూ.1,19,900 (999 డాలర్లు -128 జీబీ స్టోరేజీ బేస్ మోడల్)
# ఐఫోన్ 16 ప్రో మాక్స్ – రూ.1,44,900 (1199 డాలర్లు-256 జీబీ స్టోరేజీ)
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!