Apple iPhone 15 Launch Date in India 2023: అమెరికాకు చెందిన ‘యాపిల్’ కంపెనీ 2022లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్దమైంది. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనీ కంపెనీ ప్లాన్ చేసిందట. పలు నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అవనుందని తెలుస్తోంది.
ఐఫోన్ 15 సిరీస్‌లో నాలుగు మోడల్స్ (iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max) ఉంటాయి. ఐఫోన్ 15కి సంబంధించి ఇప్పటివరకు చాలా విషయాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మరియు ప్రో మాక్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ రెండు మోడళ్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుందట. అయితే ఫీచర్లు కూడా ఇందులో ఎక్కువ అని తెలుస్తోంది. ఈ 5 ఫీచర్లు ఈ ఫోన్‌లలో అందుబాటులో ఉంటాయని సమాచారం. వీటి కారణంగా ఐఫోన్ 15 ప్రో మరియు ప్రో మాక్స్ మోడళ్లను అభిమానులు ఎక్కువగా కొనుగోలు చేస్తారని అంచనా. ఆ ఫీచర్లు ఏంటో ఓసారి చూద్దాం.
A17 Bionic Chip:
యాపిల్ యొక్క యూఎస్‌పీ శక్తివంతమైన చిప్‌సెట్. యాపిల్ ప్రతి మోడల్‌లో చిప్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఐఫోన్ 14 ప్రో మోడల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌కి అప్‌గ్రేడ్ అయినందున, ఐఫోన్ 15 ప్రో మోడల్‌కు A17 బయోనిక్ చిప్ వస్తుందని అంచనా.
Additional RAM:
ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో ర్యామ్ అప్ గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. 6 GB నుంచి 8 GBకి అప్ గ్రేడ్ అవనుంది.
Also Read: Realme Narzo 60 Series Launch: రియల్‌మీ నార్జో 60 సిరీస్ లాంచ్.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
Titanium Frame:
ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌ను టైటానియం ఫ్రేమ్‌తో భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. ఇది టైటానియంతో చేసిన ఫ్రేమ్‌ను కలిగి ఉన్న ఐఫోన్. ఇది ఇతర మోడళ్లకు భిన్నంగా ఉంటుంది.
Action Button:
నివేదికల ప్రకారం.. మ్యూట్ స్విచ్‌ని భర్తీ చేయాలని ఆపిల్ యోచిస్తోంది. దీనిని ‘యాక్షన్ బటన్’ అని కూడా పిలుస్తారు. 15 సిరీస్‌లో ప్రత్యేకమైన కస్టమైజ్డ్ యాక్షన్ బటన్ ఉంటుంది. ఇది వినియోగదారులు అదనపు ఫీచర్‌లను ఎనేబుల్ చేయడంలో సహాయపడుతుంది.
USB-C Port with Thunderbolt:
పలు నివేదికలు మరియు లీక్‌ల ఆధారంగా.. ఐఫోన్ 15 సిరీస్ మోడల్ USB-C పోర్ట్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో థండర్‌బోల్ట్ పోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది లైవ్ 4కె థండర్‌బోల్ట్ అవుట్‌పుట్‌కు మద్దతు ఇస్తుంది.
Also Read: MS Dhoni Security Guard: ఎంఎస్ ధోనీ మంచి మనసు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!