Site icon NTV Telugu

Apple Fine UK: యాపిల్‌కు రూ.1.75 వేల కోట్ల జరిమానా

Apple Fine Uk

Apple Fine Uk

Apple Fine UK: టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ ఫీజుల విషయంలో యాపిల్ కంపెనీకి యుకెలో భారీ జరిమానా పడింది. ఈ కంపెనీ తన మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసి డెవలపర్ల నుంచి అన్యాయమైన కమీషన్లు వసూలు చేసినందుకు కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) దోషిగా తేల్చింది. ఈ నిర్ణయంలో భాగంగా యాపిల్‌కు సుమారు £1.5 బిలియన్ (సుమారు రూ.1,75,43,34,00,000) జరిమానా విధించారు.

READ ALSO: Rashmika Mandanna: ఆ పని అస్సలు చేయొద్దంటూ.. రష్మికను మందలించిన డాక్టర్‌!

కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) నివేదికల ప్రకారం.. యాపిల్ అక్టోబర్ 2015 నుంచి డిసెంబర్ 2020 వరకు యాప్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్‌లో పోటీని పరిమితం చేసింది. అలాగే ఈ సమయంలో కంపెనీ డెవలపర్‌లకు అన్యాయమైన, అధిక కమీషన్లు విధించడం వంటివి చేయడంతో, ఇది వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది. అమెరికా, యూరప్ రెండింటిలోనూ బిగ్ టెక్ కంపెనీలపై పర్యవేక్షణ, నియంత్రణ ఒత్తిడి పెరుగుతున్న సమయంలో CAT ఈ సంచలన నిర్ణయం వెలువరించింది.

జరిమానాపై అప్పీల్ చేయనున్న యాపిల్..
CAT నిర్ణయంపై అప్పీల్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. CAT నిర్ణయాన్ని తప్పుడు వివరణగా యాపిల్ పేర్కొంది. ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధి మాట్లాడుతూ.. యాపిల్ యాప్ స్టోర్ డెవలపర్లు విజయవంతం కావడానికి సహాయపడుతుందని, వినియోగదారులకు సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెలలో జరుగుతుంది, అక్కడ యాపిల్ ఎంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది, అలాగే దాని అప్పీల్ అంగీకరిస్తారా లేదా అనేది నిర్ణయిస్తారు.

వాస్తవానికి ఈ కేసును బ్రిటిష్ విద్యావేత్త రాచెల్ కెంట్ దాఖలు చేశారు. యాప్ స్టోర్, దాని ఇన్-యాప్ కొనుగోలు వ్యవస్థలో పోటీని అణచివేయడం ద్వారా యాపిల్ లాభపడిందని ఆమె ఆరోపించారు. యాపిల్ 100% గుత్తాధిపత్య స్థానం డెవలపర్లు అధిక కమీషన్లు చెల్లించవలసి వచ్చిందని కెంట్ న్యాయవాదులు వాదించారు. యాపిల్ కేవలం 17.5% న్యాయమైన కమిషన్‌ను మాత్రమే వసూలు చేసిందని పేర్కొన్నప్పటికీ, కంపెనీ వాస్తవానికి దాదాపు 30% వసూలు చేసిందని CAT విచారణలో కనుగొంది. బ్రిటన్ క్లాస్-యాక్షన్ స్టైల్ సిస్టమ్ కింద ఒక టెక్ కంపెనీపై ఇది మొదటి ప్రధాన దావా. అలాగే ఇది భవిష్యత్తులో అనేక కేసులకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ నిర్ణయం యాపిల్ కు వ్యతిరేకంగా ఒక మైలురాయి చర్యగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కంపెనీ విధానాలను మాత్రమే కాకుండా మొత్తం పరిశ్రమను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. 2026 లో ప్రారంభం కానున్న గూగుల్‌పై ఇప్పుడు ఒక ప్రధాన కేసు పెండింగ్‌లో ఉంది. దీనిలో డెవలపర్ ఫీజులకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎపిక్ గేమ్స్ కూడా అమెరికాలో యాపిల్‌పై ఇలాంటి దావాతో పోరాడుతోంది.

READ ALSO: Wobble Smartphones: స్మార్ట్‌ఫోన్ మార్కె్ట్‌లోకి మేడిన్ ఇండియా ప్లేయర్..

Exit mobile version