NTV Telugu Site icon

APPA President Venkat Rami Reddy: ఉద్యోగులకు మేలు చేశా.. అందుకే మళ్ళీ గెలిపించారు

Appa1

Appa1

రెండోసారి ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్-అప్సా అధ్యక్షునిగా ఎన్నికైన వెంకట్రామి రెడ్డికి ఉద్యోగులు అభినందనలు తెలిపారు. అప్సా కార్యాలయంలో కేక్ కట్ చేసిన వెంకట్రామి రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అందచేశారు ఉద్యోగులు. ఈ సందర్భంగా అప్పా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ఎన్నికల్లో నాపై నమ్మకంతో గెలిపించారు. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఉద్యోగులకు నా వంతు మేలు చేశాను. ఇప్పుడు అందుకే నన్ను మళ్ళీ గెలిపించారు. నా విజయంతో ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలమని ఒప్పుకుంటారా..?

నన్ను ఓడించడానికి చాలా మంది ప్రయత్నించారు. నన్ను ఎంత టార్గెట్ చేసినా.. ఉద్యోగులు మాత్రం మమ్మల్ని గెలిపించారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏపీ స‌చివాల‌య ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో వరసగా రెండో సారి అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంక‌ట్రామిరెడ్డిని అభినందించారు.

సీఎం జగన్ ని కలిసిన వెంకట్రామిరెడ్డి

తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఉద్యోగులు నా వైపే ఉన్నారు. ఎన్నికలనగానే చాలా అసత్యాలు ప్రచారం చేశారు. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు చూసి ఎన్నికలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలనే నేను ఎన్నికలకు వెళ్లాను. నిజాయితీగా పని చేసే వారికే ఉద్యోగులు పట్టం కట్టారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటానన్నారు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి.

Read Also:Today (22-12-22) Stock Market Roundup: వరుసగా రెండో రోజూ.. ‘కొవిడ్‌’ భయాలు.. నష్టాలు..

ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్ ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి వర్గం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్సా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన వెంకట్రామి రెడ్డికి 296 ఓట్ల మెజార్టీ లభించింది. వైస్ ఛైర్మన్ గా ఎర్రన్న యాదవ్, వైస్ ఛైర్మన్ (మహిళ) – సత్య సులోచన, సెక్రటరీగా శ్రీ కృష్ణ, అడిషనల్ సెక్రటరీగా గోపీకృష్ణ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా రమాదేవి, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గా మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి, ట్రెజరర్ గా వెంకట్ ఎన్నికయ్యారు. దీంతో సెక్రటేరీయేట్లో వెంకట్రామి రెడ్డి వర్గం సంబరాలు చేసుకుంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలు గెలుచుకుంది వెంకట్రామి రెడ్డి వర్గం. మొత్తం 9 పోస్టులకు 30 మంది అభ్యర్థులు పోటీచేశారు.

Read Also: Sreeleela: యంగ్ హీరోయిన్ కి కూడా కటౌట్ పెట్టేసారు…