Site icon NTV Telugu

Maldives: మోడీకి క్షమాపణ చెప్పండి.. ముయిజ్జుకి ఆ దేశ కీలక లీడర్ సూచన

Maldiv

Maldiv

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. పలువురు తమ ప్రయాణాలు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. దీంతో ఆ దేశ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. భారత్‌ పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని హితవు పలికాయి. మోడీకి, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

Read Also: Bapatla: మార్టురులో గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు.. అడ్డుకున్న ఎమ్మెల్యే

తాజాగా ఆ దేశ జుమ్‌హూరి పార్టీ నాయుకుడు ఖాసిం ఇబ్రహీం కూడా ఇదే విషయంపై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జును హెచ్చరించారు. భారత్‌తో ఘర్షణ వాతావరణం మంచిది కాదని.. తక్షణమే మోడీకి, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అంతేకాదు భారత్.. మాల్దీవుల మధ్య సంబంధాలు క్షీణించడంపై ఇబ్రహీం ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దేశం గురించి అవమానకరంగా మాట్లాడడం ఏ మాత్రం మంచిది కాదని హితవు పలికారు. పొరుగు దేశాన్ని కించపరిస్తే ఇరు దేశాల మధ్య సత్ససంబంధాలు దెబ్బతింటాయని ఇబ్రహీం అభిప్రాయపడ్డారు. తక్షణమే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.. మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: IND vs ENG: విశాఖలో క్రికెట్ సందడి.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా..!

Exit mobile version