APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం

  • ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం..
  • వైజాగ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బతీసిన అమరావతి బౌలర్స్..
  • ఎస్ డి ఎన్ వి ప్రసాద్ సూపర్ బ్యాటింగ్..
  • అమరావతి వరుసగా రెండో విజయం..
Capital Amaravati Royals

Capital Amaravati Royals

APL 2026: విశాఖపట్నం( ఏ సి ఏ వి డి సి ఏ స్టేడియం )లో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 మూడవ రోజు తొలి మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ మరియు క్యాపిటల్ అమరావతి రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. తొలుతగా టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.. మొదట బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ కు ఆది నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి ఓపెనర్లను జట్టు కోల్పోవడంతో పాటు పవర్ ప్లే లో నాలుగు వికెట్ల నష్టానికి 37 పరుగులు మాత్రమే అమరావతి జట్టు చేసింది.. ఒక దశలో 100 పరుగులు కూడా సాధ్యమేనా అన్న పరిస్థితి నుండి వరుణ్ సాత్విక్ మరియు ప్రసాద్ బ్యాటింగ్‌ను కొంత ముందుకు తీసుకు వెళ్లిన తరువాత బండారు అయ్యప్ప శశికాంత్ ఇద్దరు వేగంగా ప్రసాద్‌తో జత కలిసి టీం స్కోర్ ను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు అమరావతి జట్టు చేసింది. దీంట్లో ఎస్ ఎన్ డి వి ప్రసాద్ 45 బంతుల్లో 54 పరుగులు రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో టీంకు అండగా నిలబడ్డాడు. మరొకవైపు చివరిలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన శశికాంత్ 14 బంతుల్లో 32 పరుగులు ఒక ఫోర్ నాలుగు సిక్సర్లతో బౌలర్లపై ఎదురు దాడి చేశారు.. దీంతో ఆ జట్టు మంచి స్కోరు చేయగలిగింది.. అటు వైజాగ్ లయన్స్ జట్టు బౌలర్లలో గిరి నాథ్ రెడ్డి ఢిల్లీ గణేష్ ప్రమోద్ రెండేసి వికెట్లు తీశారు..

అనంతరం లక్ష ఛేదనతో బ్యాటింగ్ దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు ఆది నుంచి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమయ్యాయి.. జట్టు ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ వరకు ఒక్కసారిగా టీం బ్యాటింగ్ కుప్పకూలింది.. తొలి ఓవర్ నుంచే అమరావతి జట్టు పేస్ బౌలర్ టోషిత్ యాదవ్ వైజాగ్ జట్టును ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అంత 100 పరుగుల లోపే వైజాగ్ జట్టు ఆలౌట్‌ అవుతుందని భావించిన సమయంలో ధనుష్, త్రిపురన విజయ్, ఇద్దరు వేగంగా పరుగులు సాధిస్తూ టీమ్ ను లక్ష్యసాధనకు దగ్గరగా తీసుకెళ్లిన విజయ్ తీరాల వైపు చేర్చలేకపోయారు.. విజయ్ 31 బంతుల్లో 40 పరుగులు మూడు ఫ్లోర్లు, ఒక సిక్సర్ మరియు ధనుష్ 27 బంతుల్లో 33 పరుగులు ఐదు ఫోర్లు మినహాయించి వైజాగ్ జట్టులో ఎవరో చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.. చివరిలో ఒకరిద్దరు బ్యాటర్స్ అడపాదడపా బౌండరీలు బాదిన విజయానికవి సరిపోలేదు.. దీంతో ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చూడక తప్పలేదు.. అటు అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్, మూడు వికెట్లు సాధించగా బండారు అయ్యప్ప శశికాంత్ రెండేసి వికెట్లు తీసి టీం ను విజయ పదం వైపు నడిపించారు.. మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ప్రసాద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది..

×
×
Ad