APECET 2024 Notification: ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.. రాష్ట్రంలోని సెట్ల నిర్వహణ షెడ్యూల్‌ను ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తాజాగా ఈసెట్ 2024 నోటిఫికేషన్‌ను ఈసెట్ కన్వీనర్ విడుదల చేశారు.. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఈ పరీక్షల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
Also Read
పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు..
అప్లికేషన్ ఫీజు..
రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు..
దరఖాస్తు విధానం.. ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం..
ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి..
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ : 14.03.2024.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.
పరీక్ష తేది: 05.05.2023.
పరీక్షసమయం..
ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.2.30 గం.-సా.5.30 గం. వరకు..
ఈ పరీక్షల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://cets.apsche.ap.gov.in/ECET ఈ వెబ్ సైట్ లో చూడగలరు..

తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?