ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి మొదటివారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కి రెండు పేజీల లేఖ రాశారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నిపుణుల బృందం జనవరి మొదటివారంలో సందర్శిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో విపరీత జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.
Read Also: Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటినుండి కాంగ్రెస్‌పార్టీ అనుకూలంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్, యు.పి.ఏ ప్రభుత్వానిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కల. దివంగతనేత డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి కల అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో వై.ఎస్.సి.పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు 2004-2014 ల మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని మంజూరు అయ్యాయి.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టడాన్ని ప్రతిపక్ష నేతగా తప్పుపట్టారు. కానీ, వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రప్రభుత్వమే. ఈ నిర్మాణాన్ని ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌పార్టీ ప్రతినిధి బృందం సందర్శనలో ఎటువంటి రాజకీయం లేదు. పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు కాంగ్రెస్‌పార్టీకి అనుమతులు మంజూరు చేయాలి. ఆమేరకు, రాష్ట్రప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత అధికారులకు ప్రశ్నావళి రూపంలో పంపడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు గిడుగు రుద్రరాజు.
Fake Document: బతికుండగానే బరితెగించారు.. విచారణలో బయటపడ్డ భాగోతం