NTV Telugu Site icon

Hotel Cheating: హోటల్‌ బిల్లు రూ.6 లక్షలు.. బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు మాత్రమే! ఏపీ మహిళ మోసం

Hotel

Hotel

AP Woman racked up Rs 6 lakh bill at Delhi hotel: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో బస చేసి.. బిల్లు కట్టే సమయంలో మోసం చేసింది. హోటల్‌లో బిల్లు దాదాపు రూ. 6 లక్షలు కాగా.. యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది. ఇది తెలుసుకున్న హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చీటింగ్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఝాన్సీ రాణి శామ్యూల్ అనే మహిళ డిసెంబర్ 13న ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్‌మాన్‌ హోటల్‌లో 15 రోజులకు ఓ రూమ్ బుక్ చేసుకుంది. 15 రోజులకు మొత్తం బిల్లు రూ.5,88,176లు అయింది. హోటల్‌లో ‘స్పా’ కోసం ఆమె ఏకంగా రూ.2.11 లక్షలను ఖర్చు చేసింది. హోటల్‌ను విడిచివెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్‌ ద్వారా డబ్బులు పంపినట్లు సిబ్బందికి చూపించింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో.. హోటల్‌ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 13న ఆమెను అరెస్టు చేశారు.

Also Read: Delhi Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 50కి పైగా విమానాలకు అంత‌రాయం!

ఝాన్సీ రాణి ఉపయోగించిన ఖాతా నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ఇషా దేవ్ అనే నకిలీ ఐడెంటిటీ కార్డును ఆమె చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.41 మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చీటింగ్ కేసులో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో ఝాన్సీ రాణి తాను వైద్యురాలినని, తన భర్త కూడా వైద్యుడని, న్యూయార్క్‌లో ఉంటామని పోలీసులకు తెలిపింది. ఆమె పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను ఢిల్లీ పోలీసులు ఆశ్రయించిచారు. లగ్జరీ హోటల్‌లో మోసానికి పాల్పడడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం ఒక వ్యక్తి ఓ 5 స్టార్ హోటల్‌లో రూ. 23 లక్షలను మోసగించాడు.