ఇటీవలే ‘మొంథా’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీని అతలాకుతలం చేసింది. మొంథా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట అంతా నీట మునిగింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభవార్త. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాన్‌గా మారాక సెన్‌యార్‌గా నామకరణం చేయాలని ఐఎండీ భావిస్తోంది.
Also Read: YS Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటన!
వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు రాత్రి తర్వాత తుఫాన్‌గా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. దాదాపు రెండు వేల కి.మీ దూరంలో కదులుతూ బలపడుతోంది. తుఫాన్ తీవ్రతను అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీలంక దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తుఫాన్ బలపడే అవకాశం ఉంది. మరోసారి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈనెల 29నుంచి దిశంబర్ 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. రైతులు పంటలను సంరక్షించుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఐఎండీ సూచించింది.
