NTV Telugu Site icon

AP Volunteers: నేడు వాలంటీర్ల చలో విజయవాడ కార్యక్రమం..

Maxresdefault

Maxresdefault

AP Volunteers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీకి వాలంటరీలను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపకాలు చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు చేత అదించారు. దీంతో ఇక వాలంటరీ వ్యవస్థతో అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లను విధులనుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఆందోళన చెందిన వాలంటరీలు తమను తొలగిస్తారని ఆందోళన పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటివరకు చెప్పిన దాఖలు కనిపించలేదు.నిన్నటి రోజున సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపైన కీలక ప్రకటనలు చేయడం జరిగింది.

Also Read:AP Crime: భార్య చేతిలో భర్త హతం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి..!

అయితే గ్రామంలో వాలంటరీలు ఉండి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కల్పించలేకపోవడంతో ఈ రోజున ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది వాలంటరీలు. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విజయవాడ కార్యక్రమం పైన విజయవాడ పోలీసులు సైతం రియాక్ట్ అవుతూ.. మాకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు లేదని కూడా వెల్లడించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమలులో ఉన్నది అంటూ తెలిపారు. అందుకే అనుమతి లేదనే విషయాన్ని వాలంటరీలకు తెలియజేస్తున్నామంటూ పోలీసులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకి వచ్చినటువంటి వాలంటీలను అదుపులోకి తీసుకోవడానికి బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో దగ్గర పోలీసులు సైతం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.