Site icon NTV Telugu

Atchannaidu: వచ్చే ఎన్నికల్లో వారికి ఘోర పరాజయం తప్పదు..

Atvhanna

Atvhanna

TDP: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి అధికార మదంతో కన్నూ మిన్నూ కానకుండా మాట్లాడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియాల పొత్తు లేకుండా పెద్దిరెడ్డి నిలబడగలడా? అని ఆయన ప్రశ్నించారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయం.. టీడీపీ పొత్తులు బహిరంగం.. జగన్ రెడ్డివి చీకటి పొత్తులు.. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదు అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Read Also: Kesineni Nani: అటు పవన్ను.. ఇటు బీజేపీని చంద్రబాబు మోసం చేస్తున్నాడు..

రౌడీలు, మాఫియాలు, కళంకిత పోలీసుల పొత్తు లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరులో గెలవలేడు అని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. అందుకే దాదాపు 700 మందిపై అక్రమ కేసులను ఆయన పెట్టించాడు.. ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసం చేయించాడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడి నామినేషన్లు వేయకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారని పేర్కొన్నారు. పొత్తులు పెట్టుకొన్నందుకు చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటున్న పెద్దిరెడ్డికి దమ్ముంటే ఇదే పొత్తులపై ప్రధాని మోడీని ఆ మాట అనగలడా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Exit mobile version