ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ నేతలు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనంతపురంలో పర్యటించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… సమావేశంలో పాల్గొన్నారు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు. సినీ నటుడు రాజ్ కుమార్ . మొదటిసారి ఒక దుర్మార్గుడు, దోపిడీ దారుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 5 కోట్ల మంది ప్రజలు ఈ నాలుగేళ్ల లో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉంది. మనలో గ్రూపులు, టికెట్ల గొడవలు ఉండొచ్చు. కానీ అవన్నీ చంద్రబాబు చూసుకుంటారు.. ఈ ఎన్నికల్లో గొడవలు పక్కన పెట్టి పని చేయాలన్నారు.
Read Also: Bhatti Vikramarka: సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే.. ధరణి పోర్టల్ తొలగించాలి
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు టిడిపికి వేయాలి. రెండవ ప్రాధాన్యత ఓటు పిడిఎఫ్ అభ్యర్థికి వేయాలి. అన్ని ఎన్నికల్లో అక్రమంగా గెలిచారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే చేస్తున్నారు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే జైలుకు పంపేలా చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసి వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పండి. ఎవరైనా 5వేలకు ఓటు అమ్ముకుంటే భవిష్యత్ లో ఎవరూ కాపాడలేరు. వివేకానంద రెడ్డిని సొంత కూతురు చంపిందని నీచ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికే అర్హుడు కాదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మనల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది లేదన్నారు.
Read Also: New record : పుస్తక విక్రయాల్లో సాహిత్య అకాడమీ కొత్త రికార్డు