AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP 10th Class Exams 2027 Fee Schedule: ఆంధ్రప్రదేశ్‌లో 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ప్రకటించిన గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా.. ముందుగానే ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు రూ.200 ఆలస్య రుసుము వర్తిస్తుంది. ఇక డిసెంబర్ 10 నుంచి రూ.500 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులకు రూ.110 ఫీజుగా నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. వయోపరిమితి సడలింపు కోరుకునే విద్యార్థులు రూ.300 రుసుము చెల్లించాలి. విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారానే పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. CFMS లేదా బ్యాంకు చలాన్ల ద్వారా ఫీజులు చెల్లించేందుకు అనుమతి లేదని వెల్లడించారు. అలాగే మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read
- Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
- Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
- Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
- Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు షెడ్యూల్ 2027:
అదనపు రుసుము లేకుండా: 2026 నవంబర్ 11 నుంచి నవంబర్ 25 వరకు
రూ.50 అదనపు రుసుముతో: 2026 నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు
రూ.200 అదనపు రుసుముతో: 2026 డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు
రూ.500 అదనపు రుసుముతో: 2026 డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 15 వరకు
తాజావార్తలు
-
AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
-
Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
-
Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
-
Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
-
Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!