SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..
- ఏపీ SSC బోర్డు కీలక నిర్ణయం..
- తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు..
- మొత్తం 7 మార్కులు కలిపేందుకు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) బోర్డు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో కొన్ని ప్రశ్నల విషయంలో తలెత్తిన అస్పష్టతను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, విద్యార్థులకు మొత్తం 7 మార్కులను గ్రేస్ మార్కులుగా కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోని పొరపాట్ల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ అదనపు మార్కులను కేటాయిస్తున్నారు.
నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా.. ఇంగ్లీష్ పేపర్లో 5 మార్కులు, హిందీ పేపర్లో 2 మార్కులు కలపనున్నారు. ఈ సందిగ్ధ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులందరికీ ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు (DEOs) , స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 6.40 లక్షల మంది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా, వారికి మెరుగైన గ్రేడింగ్ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
Also Read:Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..
అయితే.. మరికొన్ని ప్రశ్నల్లో కూడా తప్పులు దొర్లాయని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని బోర్డు సున్నితంగా తిరస్కరించింది. ఆ ప్రశ్నలు విద్యార్థుల మేధస్సును పరీక్షించే కోణంలోనే ఇచ్చామని, వాటిలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారులు వివరణ ఇచ్చారు. కాగా, ఏప్రిల్ 6 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం (Spot Valuation) ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, ఏప్రిల్ చివరి నాటికి తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది.
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!