Site icon NTV Telugu

Thammineni Seetharam: అవినాష్‌రెడ్డి విషయం సీబీఐ చూసుకుంటుంది.. నీకేం అవసరం..?

Thammineni Seetharam

Thammineni Seetharam

Thammineni Seetharam: సంచలనం సృష్టిస్తోన్న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తాజాగా సీబీఐ ముందు హాజరుకాకుండా.. ఆస్పత్రిలో ఉన్న వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లిన విషయం విదితమే.. అయితే, మరోసారి సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది.. విచారణకు హాజరుకావాలని పేర్కొంది.. మరోవైపు.. నంద్యాలలో మీడియాతో మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇదే విషయంపై ప్రశ్న ఎదురుకావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: MP Kesineni Nani: కేశినేని నాని సంచనలం.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా కలిసి పనిచేస్తాం..!

ఎంపీ అవినాష్ రెడ్డి విషయం అడగ్గానే మీడియాపై సీరియస్ అయ్యారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుంది.. నీకు నాకు పనేంటి? ప్రతిపక్షానికి పూట గడవడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ అవినాష్ రెడ్డి పాత్ర ఉంటే.. సీబీఐ తెలుస్తుంది.. నీకు చెప్పాలా..? నువ్వేమైనా సీబీఐ చీఫ్‌వా? అంటూ మండిపడ్డారు స్పీకర్‌.. అసెంబ్లీలో ప్రతిపక్షం నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి గోల చేస్తుంది.. నేను సభ్యుల విధి విధానాలు చెపితే తప్ప వారి బాధ్యతలు తెలియదా? ప్రభుత్వం తప్పులుంటే అసెంబ్లీకి రండి..! ప్రజా సమస్యలపై చర్చించండి.. అంటూ సవాల్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. మరోవైపు.. లోకేష్‌కి కరెక్ట్ గా మాట్లాడటమే రాదు.. నిన్న కూడా మీ ఉత్సహం చూస్తుంటే 2019 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారని.. కరెక్ట్ అదే నిజమవుతుందన్నారు. గడపగడపకు వెళ్తున్న వ్యక్తిగా చెబుతున్న మళ్లీ 2024 లో పూర్తి మెజార్టీతో 175 స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

Exit mobile version