Tammineni Sitaram: తప్పు చేస్తే జైలుకు వెళ్లాలి.. కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత కోర్టుల్లో ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్లపై స్పందిస్తూ.. గతంలో దేశంలో ఎంతోమందికి రాజకీయ నాయకులు శిక్ష విధిస్తూ తీర్పులు వచ్చాయి.. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. కానీ, చంద్రబాబును హౌస్ రిమాండ్ కోసం పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Read Also: Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండే అలవాటుతో షుగర్ వ్యాధి ముప్పు..
మరోవైపు.. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు.. ఇంటికో ఉద్యోగం అన్నావు.. నిరుద్యోగులు డబ్బులు కాజేశావు అంటూ ఆరోపణలు గుప్పించారు తమ్మినేని.. రాష్ట్రాన్ని పాలించాల్సిన ముఖ్యమంత్రే అవినీతి చేస్తే ఇంకెక్కడ ఉంది న్యాయం..? అని నిలదీశారు.. సీఐడీ విచారణలో చంద్రబాబు అవినీతి బయటపడటంతోనే కోర్టు రిమాండ్ విధించిందన్నారు. చంద్రబాబు 375 కోట్ల రూపాయల అవినీతి చేస్తే.. తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డుపై దీక్షలు, ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం..? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల భూమి ఉన్న నువ్వు.. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో చెప్పండి బాబు? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కాగా, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం విదితమే..