ఏపీలో ప్రశాంతమైన వాతావరణంలో ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు ముగిసాయి..రాష్ట్ర వ్యాప్తంగా 411 పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రిలిమినరీ పరీక్షలు ఏపీ వ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించింది.. ఉదయం మొదటి పేపర్, మధ్యాహ్నం రెండో పేపర్ కు 88 శాతం మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు.. 411 పోస్టులకు 1,71,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Read Also: GITAM : ప్లేస్‌మెంట్లలో సత్తాచాటిన విద్యార్థులు.. 87 శాతం మందికి జాబ్స్
అయితే, 1,51,243 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.. రేపు ఉదయం 11 గంటల్లోపు రెండు పేపర్లకు సంబంధించి పోలీసు నియామక మండలి కీ విడుదల చేయనుంది.. వాటిపై అభ్యంతరాలను ఈ నెల 23 వ తేది లోపు తెలపాలని అభ్యర్థులను సూచించింది. ఇటు జిల్లా్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20కేంద్రాల్లో జరిగిన పరీక్షల్లో సుమారు 13వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో సెంటర్ల వద్ద అభ్యర్థుల హడావుడి కనిపించింది.
ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు… మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు రెండు విడుతల్లో పరీక్షలు జరగుతున్నాయి. ఇవాళ ఉదయం పరీక్షా కేంద్రాలను డీఐజీ ఎం.రవిప్రకాష్, ఎస్పీ ఫక్కీరప్పలు పరిశీలించారు. ఎస్ఎస్.బి.ఎన్, ఆర్ట్స్ కళాశాల తదితర సెంటర్లను అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ రవిప్రకాష్ మాట్లాడుతూ అనంతపురం రేంజ్ పరిధిలో 2 రీజినల్ సెంటర్లలోని… 41 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్టు చెప్పారు. రేంజ్ పరిధిలో అనంతపురం, తిరుపతి రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనంతపురంలో 20 సెంటర్లలో 13,423 మంది అభ్యర్థులు… తిరుపతిలో 21 సెంటర్లలో 15 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. మాస్ కాఫీయింగ్ జరుగకుండా జిరాక్స్ సెంటర్లు మూయించామని.. అనధికార వ్యక్తులు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇటు కడప జిల్లాలో ప్రశాంతంగా ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష ముగిసింది. జిల్లాలో మొత్తం 9540 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 8,335 మంది హాజరు కాగా, 1205 మంది గైర్ఝాజరు అయ్యారని జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ తెలిపారు.
Read Also: Taraka Ratna: లంకపల్లితో తారకరత్నకు అనుబంధం.. ఏటా శివరాత్రికి అక్కడ పూజలు
