Site icon NTV Telugu

AP Seeds Governance Award: ఏపీ సీడ్స్ అధికారులకు జగన్ ప్రశంసలు

Jagan 1 (1)

Jagan 1 (1)

అత్యంత ప్రతిభ, అవార్డులు అందుకుంటున్న ఏపీ సీడ్స్ సంస్థ అధికారులను అభినందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వరుసగా రెండవ ఏడాది ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌. వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితం ఈ అవార్డు అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తుంది ఏపీ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) .

Read Also:Kottu Satyanarayana: ఎంపీ నుంచి ఎంపీటీసీల వరకూ అమ్ముకుంది చంద్రబాబే

జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలకు అవార్డులు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తొమ్మిదేళ్ళుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది గవర్నెన్స్‌ నౌ అనే అంతర్జాతీయ సంస్ధ. ఈ ఏడాది పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్‌ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్‌ నౌ అవార్డు లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు. ఈ సందర్బంగా అధికారులను, మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం జగన్.

Read Also: Nadendla Manohar: తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ ప్రయాణమా?

Exit mobile version